క్యూట్,స్వీట్‌గా హీరోయిన్ రష్మిక ఫ్యామిలీ   - MicTv.in - Telugu News
mictv telugu

క్యూట్,స్వీట్‌గా హీరోయిన్ రష్మిక ఫ్యామిలీ  

February 29, 2020

hbd

టాలీవుడ్‌లోకి వరుస సినిమా హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక తాజాగా తన ఫ్యామిలీ ఫొటోను తన అభిమానుల కోసం పోస్ట్ చేసింది. తల్లిదండ్రులు, చంకలో చెల్లితో కలిసి దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. హీరోయిన్‌గా స్టార్డమ్ తెచ్చుకున్న ఆమెకు చిన్ని చెల్లి ఉండటం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

రాజ వంశీకుని మాదిరిగా సంప్రదాయ బద్ధంగా దుస్తులు ధరించి వీరంతా ఫొటోకు ఫోజులు ఇచ్చారు. దీంట్లో రష్మిక తండ్రి మదన్ మందాన, తల్లి సుమాన్ మందనా, చెల్లి శిమన్ ఉన్నారు. ఏదో సినిమా షూటింగ్‌లో భాగంగా దిగినట్టుగా ఈ ఫొటో ఉండటం అభిమానులను తెగ ఆసక్తి కలిగించింది. గీత గోవిందం’తో స్టార్ డమ్ ను పొందిన రష్మిక, ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.