Rashmika madanna autograph on fan chest in Mumbai
mictv telugu

అభిమాని గుండెపై రష్మిక ఏం చేసిందంటే..

September 27, 2022

Rashmika madanna autograph on fan chest in Mumbai

ఇష్టమైన హీరోహీరోయిన్లను ప్రత్యక్షంగా చూస్తే చాలు స్వర్గంలో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది అభిమానులకు. ఇక షేక్ హ్యాండ్స్, గీక్ హ్యాండ్స్ అవకాశం వస్తే ఆ సంబరానికి హద్దే ఉండదు. తాజాగా సూపర్ హీరోయిన్ రష్మిక మందన అభిమానికి అలాంటి సువర్ణ అవకాశం లభించింది. ఆమె ఇటీవల ముంబైలోని ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఓ వీరాభిమాని గుర్తుపట్టి పొంగిపోయాడు. నమస్కారం, షేక్ హ్యాండ్స్‌లతో సరిపెట్టుకోకుండా ముందుకు వెళ్లి ‘నా గుండె నీకోసమే లడ్ డబ్ అని కొట్టుకుంటోంది,’ టైపులో చొక్కా గుండీలు విప్పి, జస్ట్ ఓ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అన్నాడు.

అతని అభిమానానికి, తనపై చూసిన గౌరవమర్యాదాలకు ముద్దుగుమ్మ ఫ్లాట్ అయిపోయింది. రష్మిక మొదట కాస్త ఇబ్బందిపడినా ప్రేమతో పెన్ను తీసుకుని అతని టీషర్టుపై ముచ్చటగా ఆటోగ్రాఫ్ ఇచ్చేసింది. కోరిక తీరిందని అతడు మరింత అభిమానంతో ఆమె చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్పాడు. ఆ సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్మిక మంచిమనసుకు నెజిటన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమెను చూసి మిగతా హీరోయిన్లు నేర్చుకోవాలని, అభిమానులు లేకపోతే తారలు ఉండరని అంటున్నారు. టీవీ సీరియల్ నటీనటులు కూడా హాలీవుడ్ స్టార్ రేంజిలో పోజులు కొడుతూ అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వాళ్లు రష్మికలా హుందాగా ప్రేమగా ఉండాలని హితవు పలుకున్నారు. అందచందాలతోపాటు నటనతోనూ మెప్పిస్తున్న రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’తోపాటు ‘థ్యాంక్యూ’, ‘మిషన్ మజ్ను’ వంటి హైరేంజ్ బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది.