ఫ్యాన్స్‌కు రష్మిక బంపర్ ఆఫర్.. తనకు పేరు పెట్టాలంటూ..
వరుస హిట్లతో టాలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉంది హీరోయిన్ రష్మిక. స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేస్తూ.. తన కంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. క్యూట్‌గా కనిపిస్తూ అభిమానులను కూడా భారీగానే సంపాధించుకుంది. అలాగే తరుచూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. #UntoldRashmika పేరుతో ఎన్నో విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. తనకు ఓ పేరు చెప్పాలంటూ అభిమానులను కోరింది. దీనికి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఒకవేళ తాను పేరు మార్చుకోవాల్సి వస్తే ఏది బాగుంటుందో చెప్పాలని నెటిజన్లకు ప్రశ్న వేశారు. కొంచెం మంచిగా ఆలోచించి చెప్పాలంటూ ట్వీట్ చేశారు. దీంతో వీటిని చూసిన నెటిజన్లు లిల్లీ, తలా రష్మిక, మోనీ అయితే బాగుంటుందని చెప్పారు. మరికొందరు అయితే రష్మిక పేరే బాగుందని చెప్పుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి ఆమె ఎందుకు పేరు మార్పు గురించి చెప్పుకొచ్చారని పలువురు ఫ్యాన్స్ ప్రశ్నించుకుంటున్నారు. నిజంగానే ఆమె పేరు మార్చుకోవాలని అనుకుంటున్నారా..? లేక సరదాగా అడిగారా అంటూ చర్చించుకుంటున్నారు. కాగా ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలతో నటించిన రష్మిక ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనున్న సంగతి తెలిసిందే.