అందం, అభినయంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి మొత్తం సౌత్ ఇండస్ట్రీని ఉద్దేశించి వెగటు కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో తన తాజా చిత్రం మిషన్ మజ్ను సినిమా జనవరిలో డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న రష్మిక బాలీవుడ్, సౌత్ సినిమాల మధ్య తేడాను చెప్తూ నోరు జారారు. బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో బెస్ట్ అని, చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగానన్నారు. అదే సౌత్ సినిమాల్లో అన్నీ మాస్ మసాలా, ఐటం సాంగ్సే ఉంటాయని, డ్యాన్స్, అసభ్యకర స్టెప్పులు ప్రధానంగా ఉంటాయని పోల్చి చెప్పింది. దీంతో నెటిజన్లు రష్మికను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. సౌత్ ద్వారా ఫేమస్ అయిన నువ్వు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేయగానే దక్షిణాదిని అవమానిస్తావా? అంటూ ఏకిపారేస్తున్నారు. ఐటం సాంగ్స్ అన్న సౌత్ నుంచే పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. నువ్వున్న బాలీవుడ్ నుంచి ఎన్ని వచ్చాయి? అంటూ నిలదీస్తున్నారు. ఇక మరొకరైతే నిన్ను కన్నడ నుంచే కాదు మొత్తం సౌత్ నుంచి బహిష్కరించాలి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కన్నడలో కాంతార ఫేమ్ రిషభ్ షెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరిక్ పార్టీ ద్వారా పరిచయమైన రష్మిక ఆ సినిమా హీరో రక్షిత్ షెట్టితో ప్రేమ వ్యవహారం నడిపి నిశ్చితార్ధం వరకు వెళ్లింది. తర్వాత కొంత పేరు రాగానే దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇక ఇటీవల కాంతార గురించి రష్మిక చెప్పిన మాటలు వివాదం రేపాయి. దీంతో కన్నడ పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తర్వాత తత్వం బోధపడి క్షమాపణలు చెప్పినా పరిస్థితి చేయిదాటిపోవడంతో మిన్నకుండిపోయింది. ఇప్పుడు మొత్తం సౌత్ సినిమాలపై వెటకాంగా మాట్లాడడంతో ఇది ఎంతవరకు వెళ్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.