ఈడా... ఇంతేనా...... - MicTv.in - Telugu News
mictv telugu

ఈడా… ఇంతేనా……

June 20, 2017

ఏడ ఉన్నా లేకున్నా… ఈడ  మాత్రం మంచిగనే ఉంటదని అనకుంటం. కానీ ఈడ తప్ప మిగిలిందంతా ఫర్వా లేదేమో అన్పించేటట్లుంది వీళ్ల కథ. ఇంతకు ముచ్చటేందంటే…  వానాకాలం  వొస్తే పట్నాల్ల వశంగాని దోమలొస్తవి. అందుట్ల పెద్ద పెద్ద సీటిలల్ల ఇగ వాటి కథ చెప్పనే వొద్దు. రాష్ట్రపతి భవన్ అనంగనే అబ్బో…. చీమగూడ దాంట్లకు పోదని అనకుంటం కదా.  చీమ పోతదో లేదో కని… అక్కడికి పోని దోమలేదట. పోవుడు గాదు…. దోమలు పుట్టకమే ఆడనట. సాంతం ఢిల్లీల్లనే ఎక్కువ దోమలున్నది ఆన్నే అని అంటున్నరు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఒకటి కాదు రెండు ఏకంగా 1110 సార్లు  ఫిర్యాదు చేసినా రాష్ట్రపతి భవన్ అధికారులు స్పందించడం లేదట. దేశానికి తొలి పౌరుడుండే  ఏరియా అది. దాని గురించి పట్టించుకుంట లేరట. ఇదే గాదు… దేశంల్నే పెద్ద దవాఖానా ఎయిమ్స్ దాంట్లనైతే  సెప్పతరంగాని దోమలున్నయట. దోమలు లేకుండా చూసుకోండని చెప్పినా  కూడా  ఆఫీసర్లు పట్టించుకంట లేరట. ఇక  మామూలు జనాల గురించి ఏం చేస్తరో…. ఏట్ల చేస్తరో ప్రత్యేకంగ చెప్పాల్నా. అయితే పెద్ద పెద్ద సార్లుండే తాన అంతా నీట్ గా ఏమీ లేదు. కాకా పోతే పెద్ద పెద్ద సార్లు… సూట్లు, బూట్లు ఏస్కోని ఉంటరు. పైన పటారం…లోన లోటారం సామెతను నిజం చేయకుంటే మంచిగుంటదేమో.