బ్రిటిష్ పాలకులపై వీరోచితంగా పోరాడిన యోధుడు టిప్పుసుల్తాన్. అయితే ఆయన ముస్లిం అనే కారణంతో బీజేపీ నేతలు ఆ చరిత్రను పెద్దగా పట్టించుకోరు. పైగా అతడు ద్రోహి అని, హిందుత్వాన్ని నాశనం చేశాడని కూడా తిడుతుంటారు. కర్ణాటకలో టిప్పు జయంతి, వర్ధంతి వేడుకలు జరగకుండా అడ్డుపడుతుంటారు కూడా. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ నేత, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వారికి గట్టి షాకిచ్చారు.టిప్పు సుల్తాన్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని కితాబిచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ వజ్రోత్సవాల సందర్బంగా బుధవారం బెంగళూరు విధాన సౌధలో శాసన సభ, శాసన మండలి ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టిప్పు బ్రిటిష్ సైనికులపై సాహసోపేతంగా తిరగబడ్డారని కొనియాడారు. ఈ పోరులోనే ఆయన అమరుడయ్యాడని నివాళి అర్పించారు. యుద్ధ రంగంలో మైసూరు రాకెట్ల ప్రయోగంలో టిప్పు నిష్ణాతుడన్నారు. కోవింద్ ప్రశంసలతో టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని చెబుతున్న కర్ణాటకు వాదనకు బలం చేకూరింది. బీజేపీ నేతల నోట్లో పచ్చివెలక్కాయ పడింది.