రస్నా వ్యవస్థాపకులు అరీజ్ ఫిరోజ్ షా ఇక లేరు - MicTv.in - Telugu News
mictv telugu

రస్నా వ్యవస్థాపకులు అరీజ్ ఫిరోజ్ షా ఇక లేరు

November 21, 2022

ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ రస్నా వ్యవస్థాపకులు అరీజ్ ఫిరోజ్ షా శనివారం కన్ను మూశారు. కంపెనీకి చైర్మెన్ గా ఉన్న అరీజ్ చనిపోయారని సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఆయన వయసు 85 సంవత్సరాలు. కూల్ డ్రింక్ ధరలు పెరుగుతున్నప్పుడు కేవలం రూ. 5 కే 32 మంది తాగేలా రస్నాను రూపొందించారు. అప్పట్లో రస్నాకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పటికీ కూడా రస్నా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు ఎగుమతి అవుతోంది.

దేశంలో రస్నా అంటే తెలియని వారుండరు. అంతలా ఆ బ్రాండ్ పేరు సంపాదించింది. ఎన్నో కంపెనీలు వివిధ సాఫ్ట్ డ్రింకులు తెచ్చినప్పటికీ రస్నానే మార్కెట్లో లీడరుగా ఉంటూ వస్తోంది. అరీజ్ బెనోవోలెంట్ ట్రస్ట్, రస్నా ఫౌండర్ చైర్మెన్, ప్రపంచ పార్శీ ఇరానీ జొరాస్ట్రియన్ సంఘం మాజీ చైర్మెన్ గా పని చేశారు.