విమానాన్ని ఆపేసిన ఎలుక.. శంషాబాద్‌లో గందరగోళం - MicTv.in - Telugu News
mictv telugu

విమానాన్ని ఆపేసిన ఎలుక.. శంషాబాద్‌లో గందరగోళం

November 11, 2019

చిట్టెలుక చేసిన పని విమాన ప్రయాణికులకు చిర్రెత్తుకచ్చేలా చేసింది. ఏకంగా విమానం సమయానికి గాల్లోకి ఎగరకుండా చేసింది. శంషాబాద్ విమానాశ్రమంలో ఆదివారం జరిగి ఈ ఘటన ప్రయాణికులను ఆగ్రహానికి గురి చేసింది. ఏకంగా 11 గంటలు ఆలస్యంగా 

Shamshabad.

హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉదయం 6.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఎంతకీ ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ సిబ్బంది నుంచి సమాచారం అందలేదు. కొంత సేపటికి ఆరా తీస్తే ఆలస్యం అవుతుందని సమాధానం ఇచ్చారు. ఇలా అదిగో ఇదిగో అంటూ సాయంత్రం 5.30 గంటలకు ప్లైట్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆలస్యానికి ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంత సేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. 

Shamshabad

చిన్న ఎలుక వల్లే విమానం అన్ని గంటలు ఆలస్యమైనట్టు తెలిపారు. విమానంలో ఎలుక ఓ ఎలుక దూరడాన్ని  గమనించిన సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ఏటీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అది ఎంతకీ పట్టుబడకపోవడంతో సుమారు పది గంటలకుపైగా శ్రమించారు. వీరి చర్య కారణంగా సుమారు 50 మంది ప్రయాణికులు తమ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. 250 మందితో బయలుదేరాల్సిన విమానం చివరకు 200 మందితో వెళ్లింది.