Ratan Tata Celebrates 25 Years Of Tata Indica Car...Has A Special Place In My Heart. tata
mictv telugu

ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకం-రతన్ టాటా

January 16, 2023

  Ratan Tata Celebrates 25 Years Of Tata Indica Car...Has A Special Place In My Heart. tata

రతన్ టాటా….ఎంత పారిశ్రామికవేత్తో తెలియని వాళ్ళెవరో. వ్యాపారం వారసత్వంగా వచ్చినా సరే తనదైన శైలిలో దానిని పరుగులు పెట్టించిన ఘనత మాత్రం రతన్ టాటాకే దక్కుతుంది. కొన్నేళ్ళు చక్రం తిప్పిన రతన్ టాటా ప్రస్తుతం టాటా ట్రస్ట్ కు ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. అదే కాదు సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా ఆక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచుగా పోస్ట్ లు పెడుతుంటారు. తాజాగా టాటా మోటార్స్ తయారుచేసిన టాటా ఇండికా కారు ఫోటో ను పెట్టి….దాని మీద తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. ఇండికా కారు పక్కన నిల్చున్నప్పుడు తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 25 ఏళ్ళ క్రితం టాటా ఇండికాను ప్రారంభించడం భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రకు తొలిమెట్టు, ఇది నాకు ఎప్పుడూ స్పెషల్….దీనికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందంటూ రాశారు.

టాటా వాళ్ళ మొట్టమొదటి కారు ఇండికా. 1998లో దీన్ని లాంచ్ చేశారు. దీంతో వీళ్ళ కార్ల ప్రస్థానం మొదలైంది. తర్వాత కార్ల తయారీలో, అమ్మకంలో తొందరగానే ప్రథమ స్థానానికి వచ్చేశారు. క్యాబ్ సర్వీసులకు టాటా ఇండికా కారునే ఎక్కువ వాడేవారు. 2018 వరకు ఇండికా సక్సెస్ ఫుల్ మోడల్ గా రాణించింది. రతన్ టాటా పోస్ట్ ను ఇన్స్టాలో 20 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అదేకాకుండా ఇండికాతో తమకున్న అనుభవాలను కూడా పంచుకున్నారు.