rats damage car in Bangalore, owner demands rs. 5 lakhs
mictv telugu

ఎలుక వల్ల రూ.5 లక్షల నష్టం.. పీఎస్‌లో ఫిర్యాదు

June 24, 2022

rats damage car in Bangalore, owner demands rs. 5 lakhs

ఓ ఎలుక కారణంగా తాను నష్టపోయానని, నష్ట పరిహారంగా తనకు రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌పై గొడవకు దిగాడు ఓ కారు యజమని. అపార్ట్‌మెంట్‌లో చెత్త పేరుకపోవడం వల్లే ఎలుకలు ఎక్కువయ్యాయని, తన కారులోని ఓ వైర్‌ను ఎలుక కొరికేయడంతో కారు చెడిపోయిందని అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షున్ని డిమాండ్‌ చేశాడు. ఇది గొడవగా మారి పోలీసుస్టేషన్‌లో కేస్‌ అయింది.

బెంగళూరు గంగానగరలో కంఫర్ట్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్న కారు యజమాని.. చెత్త తొలగించపోవడం వల్లనే ఎలుకల బెడద వచ్చిందని, ఈ నిర్లక్ష్యానికి అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ కారణమంటూ గలాటా చేశాడు. ఈ గలాటతో ఆక్రోశానికి గురైన ఇతర ఫ్లాట్లవారు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.5 లక్షలు ఇవ్వాలని తమను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.