సరుకులతోపాటు ఎలుక ఫ్రీ... - MicTv.in - Telugu News
mictv telugu

సరుకులతోపాటు ఎలుక ఫ్రీ…

August 10, 2017

ఆన్ లైన్లో ఇప్పుడు ఎలుకలు కూడా దొరుకుతున్నాయి.  అరే అదేంటి ఇండ్లల్లనే ఎలుకలున్నాయంటే…. ఆన్ లైన్లో కూడా దొరుకుతున్నాయా అనే అనుమానం వద్దు.  హైద్రాబాద్  మాదాపూర్ లో ఓ మహిళ  ఆన్ లైన్లో మినుములు బుక్ చేసింది. మినుములతో పాటు  ప్యాకింగ్ లో ఎలుక కూడా వచ్చింది.

ఇంతకు ముందు హోటల్లల్లోని ఇండ్లీ, సాంబర్లలల్ల బల్లులు, బొద్దింకలు, జెర్రులు రావడం చూసినం.  కొన్ని పెద్ద పెద్ద హోటల్లల్ల చేసే ఫ్రైలల్ల ఎలుకలు వచ్చాయి. సూపర్ మార్కెట్లు… పేరు మోసిన షాపింగ్ మాల్లల్ల కూడా  సరుకులతోపాటు ఎలుకలు కూడా సరఫరా చేస్తున్నట్లుంది. జనాలు పనులకు వెళ్లే హడావిడిలో ఉండి. తమకు కావాల్సిన సరుకులు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు. అట్లాగే ఓ మహిళ ఆన్ లైన్ ద్వారా మినుములు బుక్ చేసుకున్నది. సరుకులతో పాటు ఎలుకను కూడా  పంపించారు సదరు షాపు వారు. వినియోగదారులకు ఇదో రకం బోనాంజా ఇస్తున్నాయి షాపింగ్  మాల్స్…. పెద్ద పెద్ద షాపులు.