బాలీవుడ్ లో ప్రేమ కథలకు కొదవే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 90లలో అలా ఫేమస్ అయిన ప్రేమ కథ అక్షయ్ కుమార్, రవీనా టాండన్ లది. వీళ్ళిద్దరూ అందరి కళ్ళల్లోనూ, నోళ్ళల్లోనూ కూడా పడ్డారు. వీళ్ళఉ పెళ్ళి చేసుకుంటారని ఫిక్స్ కూడా అయిపోయారు. అయితే దానికి విరుద్ధంగా అక్షయ్-రవీనా బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత దీని గురించి కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పిందీ రవీనా.
అక్షయ్- రవీనాలకు ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందట. 1994లో వచ్చిన మొహ్రా సినిమాలో కలిసి నటించారు వీళ్ళద్దరూ. అప్పటి నుంచీ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుని ఎందుకు విడిపోయారు అని అడిగితే మాత్రం ఏమో గుర్తు లేదు అని చెప్పింది. ఏదో జరిగింది…ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళం చూసుకున్నాం అంటోంది. తర్వాత అక్షయ్ మరొకరితో డేటింగ్ చేశాడని, తాను కూడా ఇంకొకరిని చూసుకున్నాని చెప్పింది. అంతా ప్రేమించుకుని, ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుని ఎందుకు విడిపోయారో గుర్తు లేకపోవడం మాత్రం చాలా విచిత్రం. చెప్పలేను అంటే ఒకే కానీ గుర్తు లేదు అంటేనే టూ మచ్ గా ఉంది. అదేంటో ఈ సెలబ్రిటీల మాటలు, చేతలు ఒక్కోసారి అర్ధం కావు, విడ్డూరంగానూ కూడా ఉంటాయి.
విడిపోయిన తర్వాత అక్షయ్ మీద జెలసీ ఉందా అని యాంకర్ అడిగిన క్వశ్చన్ కి…ఎందుకుంటుంది? ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాంగా అంటూ బదులిచ్చింది రవీనా. పైగా ఇప్పటికీ తమది హిట్ పెయిరేనని, ఇద్దరం అప్పుడప్పుడూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పింది.