బాలీవుడ్‌లో ఒకప్పటి అగ్రకథానాయిక, అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న నటి రవీనా టాండన్.. ఇటీవల కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం సినిమాల కంటే కూడా ఓటీటీలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ కెరీర్‌ని బిజీగా గడుపుతోంది. 1990లలో యువత కలల రాణి అయిన రవీనా టాండన్.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల ఓ మీడియాతో పంచుకుంది. ‘16 ఏళ్ల వయసులో సినిమాల్లో కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. కొన్ని విషయాల్లో అసౌకర్యంగా అనిపించేది. నాకు నచ్చని సన్నివేశాలను చేయనని గట్టిగా చెప్పేదాన్ని. దాంతో కొన్ని అవకాశాలు కూడా కోల్పోయాను.
ముఖ్యంగా స్విమ్ సూట్ ధరించి ఈత కొట్టడం, అసభ్యంగా ఉండే డ్యాన్స్ మూమెంట్స్ చేయడం, ముద్దు సీన్లలో నటించలేదు. దాంతో నాకు అహంకారం అనే ముద్ర పడింది. అలాగే నేను రెండు రేప్ సీన్లలో నటించాను. వాటిలో ఎలాంటి అసభ్యత లేకుండా జాగ్రత్త పడ్డా. అందులోనూ నా డ్రెస్సు చిరగకూడదని కండీషన్ పెట్టేదాన్ని. ఒంటి మీది బట్టలు ఒక్క చిరుగు లేకుండా రేప్ సీన్లలో నటించింది పూర్తి ఇండస్ట్రీలో నేను మాత్రమే ఉన్నాను. క్యాస్టూమ్స్ విషయంలో అంత నిక్కచ్చిగా ఉండేదాన్ని’ అంటూ వెల్లడించింది. అలాగే బాడీ షేమింగ్ అంశంపై స్పందిస్తూ కెరీర్ ప్రారంభంలో తనకు కూడా అలాంటి విమర్శలు వచ్చాయని, మొదట్లో బాధనిపించినా కానీ తర్వాత అలవాటు పడి వాటిని పట్టించుకోవడం మానేశానని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
అయ్యో ‘రాధికా’… ఆఫర్లే కరువయ్యాయా.?
హీరో మాటలకు సిగ్గుతో తల తిప్పుకున్న హీరోయిన్ శ్రియ.. ఇంట్రెస్టింగ్ వీడియో