Raveena Tandon Recalls Traumatic Incident From Fan Who Attack On Her Car
mictv telugu

బాలయ్య హీరోయిన్ పై బండ రాయితో దాడి.. రక్తంతో లేఖ

November 7, 2022

సౌత్ లో కంటే నార్త్ లో ఫ్యాన్స్ బెడద కాస్త తక్కువే ఉంటుంది. హీరోలపై తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీల్లో ఉండే పిచ్చి అభిమానం బాలీవుడ్ హీరోలపై అంతగా కనపడదు. ఇక్కడ నచ్చితే గుడులు కడతారు, ఇంకాస్త నచ్చితే ముఖ్యమంత్రులని చేస్తారు. సినీ స్టార్స్ ని ఒక ఆరాద్యదైవంగా కొలుస్తుంటారు. అయితే ఈ పిచ్చి అభిమానం కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంది. అచ్చం ఇలాంటి ఒక సైకో ఫ్యాన్ చేసిన దాష్టుకాన్ని వివరించింది ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్‌. 1990’sలో తన గ్లామర్ షోతో బాలీవుడ్ కుర్రకారుని ఊపేసింది ఈ బ్యూటీ. ‘తూ చీజ్ బడి హాయ్ మస్త్ మస్త్’ అంటూ బీ టౌన్ ఫ్యాన్స్ ఆమెని తెగ ఆరాధించేవారు. రవీనా ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే ఎవర్ గ్రీన్ రెయిన్ సాంగ్ చూస్తే నేటికీ చమటలు పడతాయి. అలాంటి స్టార్ హీరోయిన్ గతంలో తనకి జరిగిన ఒక చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది.

Raveena Tandon Recalls Traumatic Incident From Fan Who Attack On Her Car

తనని ఒక ఫ్యాన్ ఎంతలా వేధించేవాడో వివరించింది. ఇతని వేధింపులు తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియాతో రవీనా టాండన్‌ మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో నాకు ఓ వీరాభిమాని ఉండేవాడు. అతని అభిమానం ఏ స్థాయికి చేరిందంటే? రక్తంతో లేఖలు రాసి పంపేవాడు. నా ఇంటి గేటు బయట గంటలు గంటలు కాపు కాసేవాడు. చివరికి ఆ అభిమానం పతాక స్థాయికి చేరి కొరియర్ ద్వారా నాకు కొన్ని జుగుప్సాకరమైన ఫొటోల్ని పంపాడు. ఆ తర్వాత ఓ రోజు నేను, మా ఆయన, పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా.. పెద్ద రాయితో దాడి చేశాడు. చాలా భయమేసింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాను’’ అని ఆమె గుర్తు చేసుకుంది. ఇక బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’ తో తెలుగు ప్రేక్షకులకి ఈమె సుపరిచితమే. లేటెస్ట్ గా కేజిఎఫ్ 2లోను నటించింది. ఇందిరా గాంధీ పోలికలతో కనిపించే ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా హీరో యష్ కి దీటుగా నటించి మెప్పించింది రవీనా టాండన్‌.