మంత్రి మల్లారెడ్డి ప్రారంభించిన పాఠశాలకు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి మల్లారెడ్డి ప్రారంభించిన పాఠశాలకు నోటీసులు

May 18, 2019

మంత్రి మల్లారెడ్డి ప్రారంభించిన ఓ ప్రైవేట్ స్కూలు వివాదంలో చిక్కుంది. ప్రముఖ హీరో వెంకటేశ్, డెరెక్టర్ అనిల్ రవిపూడి, నిర్మాత దిల్‌రాజు‌తో కలిసి  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం పరిధిలోని నారపల్లిలో శుక్రవారం రవీస్ ఇంటర్నేషనల్ స్కూలును ప్రారంభించారు.

Ravees international school Inauguration minister Mallareddy, Hero venkatesh, producer dil raju, Director anil ravipudi At medchal district

అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, అందుకు కార్పొరేట్ విద్యాసంస్థలు కృషి చేయాలన్నారు. హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు దృష్టి సారించాలని, అప్పుడే వారు బాగా చదివి ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే పాఠశాలకు అనుమతి లేదంటూ విద్యాశాఖ అధికారులు పాఠశాలకు నోటీసులు అంటించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలను ఎలా ప్రారంభింస్తారని, అనుమతులు తీసుకోవాలని పలు మార్లు నోటీసులిచ్చినా యాజమాన్యం అనుమతి తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో నరసింహారెడ్డి పాఠశాల గేటుకు నోటీసులు అంటించారు.

ఎలాంటి అనుమతులు లేని పాఠశాలను.. మంత్రి, ప్రముఖులు వచ్చి ఎలా ప్రారంభిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులైన ఈ విషయాన్ని మంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైందని, ఇంటర్నేషనల్ స్కూల్ అని విద్యార్థులు జాయిన్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.