ప్రముఖ తెలుగు నటుడు చలపతిరావు (78) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ వర్గాలు ఆదివారం తెలిపాయి.
దాదాపు 600 చిత్రాలలో వివిధ పాత్రలను పోషించాడు చలపతిరావు. NT రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ చిత్రాలలో సహాయ నటుడిగా, విలన్గా, కమెడియన్ గా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఫ్యాక్షన్ చిత్రం ఆదిలో యూత్ కి తెగ కనెక్ట్ అయ్యారు. కొడుకు రవిబాబు అల్లరి చిత్రంలోనూ కామెడీని అద్భుతంగా పండించారు. ఇక దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ, చలపతిరావులది డెడ్లి కాంబినేషన్ అంటారు. యమగోల, యుగపురుషుడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, నిన్నే పెళ్లాడతా, అల్లరి వంటి అనేక సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చలపతిరావు. అయితే ఆయన మరణానికి ముందు జరిగిన విషయాలని మీడియాతో పంచుకున్నాడు చలపతిరావు కొడుకు రవిబాబు. తన దర్శకత్వంలో ఐదు రోజుల కిందట నాన్నగారు నటించారని, నిన్న రాత్రి కూడా చికెన్ బిర్యానీ తిని పడుకున్నాడని, ఎటువంటి నొప్పి ఇబ్బంది లేకుండా నాన్నగారు కన్నుమూశారని రవిబాబు పేర్కొన్నారు.
అయితే రవిబాబు కామెంట్స్ పై నెటిజన్స్ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. 78ఏళ్ళ వయసున్న పెద్దయానికి రాత్రి సమయంలో లైట్ ఫుడ్ పెట్టాలి కానీ బిర్యానీ పెడతారా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక చలపతిరావు మంచి భోజన ప్రియుడని.. తండ్రికి కావాల్సిన భోజనం పెడితే తప్పేంటీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చలపతి రావు మరణంపై రవిబాబు మాట్లాడుతూ.. “శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత, ప్లేట్ చేతికిచ్చి ఒక్కసారిగా వెనక్కి వాలిపోయారు” అని రవిబాబు వెల్లడించారు. చలపతి రావు నిజ జీవితంలో ఆనందంగా గడుపుతూ అందరినీ ఎలాగైతే నవ్వించేవారో అలాగే హ్యాపీగా వెళ్లిపోయారని చెప్పారు. ఇక అమెరికాలో ఉండే సిస్టర్స్ ఇద్దరూ సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం ఇండియాకు చేరుకుంటారని చెప్పిన రవిబాబు.. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటి వరకు బాడీని మహాప్రస్థానంలో ఫ్రీజర్లో ఉంచుతామని అన్నారు రవిబాబు.