టీవీ9 లోగోలు అమ్మేసిన రవిప్రకాష్.. కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ9 లోగోలు అమ్మేసిన రవిప్రకాష్.. కేసు నమోదు

May 17, 2019

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు మరింత సంక్లిష్టమవుతోంది. ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న ఆయనపై టీవీ9 చానల్ లోగో సహా ఆరు లోగోలను తన సొంత చానల్ మోజో టీవీకి అమ్మేశారంటూ మరో కేసు నమోదైంది. ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ravi prakash soled tv9 logo to mojo tv..

రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తిలు టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.99 వేలకు అమ్మేశారని కౌశిక్‌రావు తన ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు గతేడాది 31న డీడ్ ద్వారా వాటిని రాసి ఇచ్చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీవీ9 లోగోలు అమ్మినందుకు రావాల్సిన రూ.99 వేలను నెక్ట్స్‌ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు బదిలీ చేశారని అయితే, ఆ డబ్బుని ‘అదర్‌ రిపెయిర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌’గా పేర్కొన్నారని కౌశిక్ రావు తెలిపారు. కోట్ల రూపాయల విలువచేసే లోగోలను రవిప్రకాశ్ కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించేలా అమ్మేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.