అటు మ్యాచ్.. ఇటు నిద్ర.. రవిశాస్త్రిపై ట్రోల్స్ - MicTv.in - Telugu News
mictv telugu

అటు మ్యాచ్.. ఇటు నిద్ర.. రవిశాస్త్రిపై ట్రోల్స్

October 22, 2019

సఫారీలపై టీం ఇండియా టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రాంచీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీని సాధించింది. టీం ఇండియా ఆటతీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. అయితే ఇదే సమయంలో కోచ్ రవిశాస్త్రి చేష్టలు విమర్శలకు దారి తీసింది. ఫెవిలియన్ బాల్కనీలో కూర్చొని నిద్రపోతూ కెమెరాకు చిక్కారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. 

Ravi Shastri Sleeping.

ఓవైపు మ్యాచ్ జరుగుతుండగానే రవిశాస్త్రి పెవిలియన్‌ బాల్కనీలో కుర్చోని హాయిగా కునుకు తీశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో క్రికెట్ ప్రియులు ఆయన పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో ముఖ్యమైన పదవిలో ఉన్న ఆయన ఇలా కునుకుపాట్లు పట్టడం ఏంటని మండిపడుతున్నారు. రవిశాస్త్రీ నిద్రపోవడానికి రూ. 10 కోట్లు జీతం ఇవ్వడం లేదంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు ఖాయం అనుకోని రవిశాస్త్రి సరదాగా ఓ నిద్ర తీశారంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.