మళ్ళీ కోచ్‌గా రవి శాస్త్రికే అవకాశం! - MicTv.in - Telugu News
mictv telugu

మళ్ళీ కోచ్‌గా రవి శాస్త్రికే అవకాశం!

July 18, 2019

Ravi Shastri.

ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి, అతడి సహాయక బృందం పదవికాలం ఇటీవల ముగిసిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కోచింగ్‌ సిబ్బంది నియామకం కోసం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, ఫిజియో థెరపిస్టు, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పదవులకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా మళ్ళీ రవిశాస్త్రినే ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

రవి శాస్త్రి కోచ్‌గా నియామకమైన నాటి నుంచి జట్టు కోసం తీవ్రంగా శ్రమించాడని.. జట్టులోని ఆటగాళ్లందరితో మంచి సమన్వయంతో ముందుకు సాగుతున్నారని ఆయన కోచ్‌గా నియమితులు అయిన తరువాత టీమిండియా టెస్టుల్లో మొదటిస్థానంలో, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోచ్‌గా అతని సామర్థ్యం ఏమిటో చెప్పటానికి ఇవి చాలు. ప్రపంచకప్‌లో కేవలం ఒక్క ఓటమిని కారణంగా చూపిస్తూ అతనిని కాదనుకోవడం సరైన నిర్ణయం కాదని ఒకవేళ అతను కోచ్‌ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే దాదాపు అతనికే ప్రాధాన్యత ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ ప్రధాన అధికారి పేర్కొన్నారు. జట్టులో ఆటగాళ్లు కూడా కోచ్‌గా అతని నేతృత్వంలోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.