చాలా రోజుల తర్వాత మాస్ మహారాజా రవితేజ ఖాతాలో హిట్ పడింది. తనదైన బాడీ లాంగ్వేజ్ కి సరైన కథ తోడయితే ఎలా ఉంటుందో ధమాకా చిత్రం ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. గత రెండు సినిమాలు ప్లాపవడంతో ఇది కూడా పోతుందని చాలా మంది భావించారు. కానీ సినిమా రిలీజ్ కి ముందు ఒక్కో అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన సంగీతం ఇందులో ప్రధాన భూమిక వహించింది. శ్రీలీల గ్లామర్ కూడా తోడవడంతో సినిమాను తప్పకుండా చూడాలనే భావన సగటు ప్రేక్షకుడికి కలిగింది. ఆ ప్రభావం విడుదలైన రోజు డిసెంబర్ 22న థియేటర్లో కనిపించింది. వసూళ్లు కూడా అదే స్థాయిలో రాగా, తొలిరోజు మొత్తం కలెక్షన్లు రూ. 10 కోట్లు దాటింది. ధమాకా రిలీజై ఇప్పటికి పది రోజుల అవగా, మొత్తం వసూళ్లు రూ. 89 అని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది
ఇవి కూడా చదవండి :
‘మా సినిమా చూస్తే.. రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కానీ ఓ కండీషన్’
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు.. పుట్టపర్తిలో న్యూ ఇయర్
బుద్దుందా నీకు.. మైక్ దొరికిందని మతి లేకుండా వాగొద్దు..!
రష్మికపై మరోసారి రిషబ్ శెట్టి సీరియస్..!