Hero Ravi Teja Movie dhamaka May Collect 100 Crores
mictv telugu

మైండ్ బ్లోయింగ్ మాస్.. రవితేజకి తోలి 100కోట్లు ?

January 3, 2023

raviteja may get first time 100 crore collection by dhamaka

ధమాకా సునామి ఇప్పట్లో బాక్సాఫీస్ దెగ్గర ఆగేలా లేదు. హీరో రవితేజ తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంటే.. హీరోయిన్ శ్రీలీలా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పల్సర్ బైక్ పాటకి శ్రీలీలా వేసిన స్టెప్స్ థియేటర్లో కాసుల వర్షం కురిపిస్తుంది. కొద్ది సెకండ్స్ పాటు భూమిపై ఎలాగైతే ఉరుములు అలజడి సృష్టిస్తాయో.. సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు నిమిషాల పల్సర్ పాటకి థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. బి సెంటర్స్ షేక్ అయిపోతున్నాయి. మాస్ మహారాజని మించి శ్రీలీలా మ్యాజిక్, పల్సార్ బైక్ సాంగ్ ధమాకాని నిలబెట్టేశాయని విశ్లేషణలు వస్తున్నాయి. లేదంటే అసలు ధమాకాకి ఈ రేంజ్ కలెక్షన్స్ ని హేమాహేమీలు, క్రిటిక్స్ సైతం ఊహించలేదు. విడుదలకి ముందు వరకు హైప్ భారీగానే వచ్చింది. ఇక ఫస్ట్ డే మార్నింగ్ షో అయిపోగానే అందరు నెగిటీవ్ రివ్యూసే ఇచ్చారు.

ఈ ట్రెండ్ లో కూడా ఈ మూస కథలేంటీ.. పక్క ఫ్లాప్ అంటూ విరుచుకుపడ్డారు. 90శాతం వెబ్ సైట్స్ 2 రేటింగ్ ఇవ్వగా.. చాలా కొద్దీ మాత్రమే 2.5 రేటింగ్ ఇచ్చి యావరేజ్ అన్నారు. కానీ ఈ యావరేజ్ కంటెంట్ కాస్త యమా స్పీడ్ తో దూసుకెళ్తుంది. అనూహ్యంగా విశ్లేషకుల అంచనాలని తలకిందులు చేస్తూ.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే 11వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.63 కోట్ల రేంజ్‌లో షేర్‌ను రాబట్టి మరోసారి సత్తా చాటింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్‌గా 10 రోజుల కలెక్షన్స్‌ను చూస్తే.89.50 కోట్ల గ్రాస్ వస్తే 11రోజులకు గాను 91కోట్లు క్రాస్ చేసేసింది అంటున్నారు. ఇక రాబోయే పది రోజుల వరకు మరో పెద్ద సినిమాలేదు. దీంతో రవితేజ 100కోట్లు దాటడం గ్యారెంటీ అంటున్నారు. ఓవరాల్ గా ధమాకా 120 నుండి 150కోట్ల వరకు వసూళ్లు సాధించొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇక మల్టిప్లెక్స్ మినహాయిస్తే.. బీ, సీ సెంటర్స్ లో ధమాకాకి ఇంకా హౌస్ బోర్డులే కనిపిస్తున్నాయి. రవితేజ‌ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు వున్నాయి కానీ వంద కోట్ల సినిమా లేదు. ఆ లోటు ను ధమాకా సినిమా తీర్చేస్తోందని అంచనాలు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

అంతరిక్షానికి చేరుకున్న సినిమా

నా లైఫ్‌లో ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. శ్రీజ

బీజేపీని దెబ్బ కొట్టింది నినే.. కేసీఆర్ కాదు ED,CBI ఎవనికి భయపడేది లేదు.. ఎమ్మెల్యే కొనుగోలు పై పైలట్ రోహిత్ రెడ్డి