మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలు విడుదలై అభిమానులను ఆకట్టుకున్నాయి. త్వరలో పూనకాలు లోడింగ్ అనే మరో పాటను కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో మరింతగా వేగం పెంచుతూ.. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. చిరంజీవి, రవితేజతో పాటు ఈ సినిమాలో నటించిన దాదాపు అందరు ఆర్టిస్టులు ఈ మీట్‌కి వచ్చారు. కానీ హీరోయిన్ శృతి హాసన్ మాత్రం రాలేదు. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవితో పాటు రవితేజ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ సినిమాలో మాస్ మహారాజా 44 నిమిషాలసేపు తెరపైన కనిపిస్తారట. ఇందుకోసం రవితేజ సినిమా నిర్మాతలు రూ.17 కోట్లు పారితోషికం చెల్లించాలని నెట్టింట రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వాల్తేరు వీరయ్య చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర చేస్తున్న రవితేజ.. తన మిగితా సినిమాల రెమ్యునరేషన్ లానే 18కోట్లు డిమాండ్ చేశాడట. కానీ నిర్మతలు 11కోట్ల నుండి బేరసారాలు మొదలుపెడితే.. చివరికి ఒక కోటి తగ్గించి 17కోట్లకు ఫైనల్ చేశాడట రవితేజ. అయితే ఈ సినిమాకి రవితేజ ఇచ్చిన కాల్షీట్స్ కేవలం 15రోజులే. ఇక సినిమాలోనూ కనిపించేది 44నిమిషాలే అని తెలుస్తుంది. అయితే 15రోజులకే 17కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న రవితేజ చిరంజీవిని మించిపోయాడని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వాల్తేరు వీరయ్య చిత్రానికి 45రోజుల కాల్షీట్స్ కి చిరంజీవి 30కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ లెక్కన చిరు డేట్స్ తో కంపేర్ చేస్తే.. సగం రోజులు కూడా పనిచేయకుండా 17కోట్లు తీసుకుంటున్నాడు రవితేజ. దాంతో చిరంజీవితో పోల్చుకుంటే రవితేజ రెమ్యునరేషన్ ఎక్కువని.. మాస్ మహారాజానా మజాకానా అంటున్నారు ఫ్యాన్స్.