ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ని మొదలు పెట్టి ‘మాస్ మహారాజా’ స్ధాయికి ఎదిగాడు రవితేజ. అయితే ఇప్పుడు తన కొడుకును మహాధన్ ను కూడా వెండితెరకు పరిచయం చెయ్యబోతున్నాడట. రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ’రాజా ది గ్రేట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే రవితేజ కొడుకు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడట. ఈ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రలో మహాధన్ కనిపించ బోతున్నాడని సమాచారం. తెరపైన ఎంతో ఎనర్జిటిగ్గా నటించే రవితేజతో పాటు త్వరలో బుల్లి రవితేజను కూడా తెరపైన చూడబోతున్నాం. ఇగ’ రాజా ది గ్రేట్’సినిమా విడుదలైనంక రవితేజ ఫ్యాన్స్ కి మాత్రం డబుల్ ధమాకాతో పాటు జింతాత చితా చితే పోన్రి.