అద్భుతమైన ప్రదర్శనతో ఇటీవల అదరగొడుతున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఏకంగా నెం.1 స్థానానికి చేరుకున్నాడు. టాప్‌లో ఉన్న ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ స్థానానికి అశ్విన్ ఎసరుపెట్టాడు. 864 పాయింట్లతొ అశ్విన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా..859లో అండర్సన్ రెండవ స్థానంలో ఉన్నాడు. 6 నెలలుగా ఆటకు దూరంగా టీం ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం టాప్ -5 చోటు దక్కించుకోవడం విశేషం. అతడు 795 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో అశ్విన్ సత్తా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ బౌలింగ్ ఎదుర్కోలేక కంగారులు ముప్పుతిప్పలు పడ్డారు. తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అశ్విన్. తద్వారా ర్యాంకింగ్స్‌లోనూ ముందుకు దూసుకొచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపకపోవడం అశ్విన్‌కు కలిసొచ్చింది. అతడు రెండో టెస్ట్‌లో కేవలం 3 వికెట్లు మాత్రమే సాధించాడు. టెస్ట్‌ల్లో అశ్విన్, వన్డేలో సిరాజ్ రూపంలో ఇద్దరు ఇండియా బౌలర్లు ఐసీసీ టాప్ ర్యాంకింగ్స్ లో ఉండడం విశేషం.
టాప్-5 టెస్ట్ బౌలర్స్
1.రవించంద్రన్ అశ్విన్(ఇండియా) -864
2.జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్) -859
3.ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)-858
4.జస్ప్రీత్ బుమ్రా(ఇండియా) -795
5.షాహిన్ అఫ్రిది(పాకిస్తాన్) -787