Ravindra Jadeja gives BIG update on injury, set to make comeback after...
mictv telugu

హాస్పిటల్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఆపరేషన్ సక్సెస్

September 7, 2022

ఆసియా కప్ 2022 టోర్నీ మధ్యలో గాయపడి, జట్టుకి దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. తాను కోలుకోవడం మొదలెట్టానని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు జడ్డూ. ‘సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. నాకు అండగా నిలిచిన బీసీసీఐకి, నా టీమ్‌మేట్స్‌కి, సపోర్ట్ స్టాఫ్‌కి, ఫిజియోలకు, డాక్టర్లకు, నా అభిమానులకు థ్యాంక్స్… నేను కోలుకోవడం మొదలెట్టా. త్వరలోనే మళ్లీ వస్తాను… నాకు విషెస్ తెలిపిన అందరికీ థ్యాంక్స్…’ అంటూ పోస్ట్ చేశాడు రవీంద్ర జడేజా.

ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 35 పరుగులే రాణించాడు. అయితే, హాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జడేజా మోకాలికి గాయమైంది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరి మాకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ కారణంగా రవీంద్ జడేజా ఈ టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు.

జడేజా మోకాలికి ఆపరేషన్ చేయడంతో ఆయన త్వరలో జరుగనున్న ఐసీసీ వరల్డ్ టీ20 కప్ మెగా ఈవెంట్‌లో ఆడటం అనుమానాస్పదంగా మారింది. గాయానికి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరి జడేజా ఫోటోలను ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాయం నుంచి జడేజా త్వరగా కోలుకోవాలని, అతడు మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉందంటూ ట్వీట్ చేసింది.