చెన్నై విజయం.. కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు సంక్షిష్టం - MicTv.in - Telugu News
mictv telugu

చెన్నై విజయం.. కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు సంక్షిష్టం

October 30, 2020

ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ప్లే ఆఫ్స్‌కు దూరమైన సంగతి తెల్సిందే. చెన్నై పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. అయినా కూడా మిగిలిన లీగ్ మ్యాచ్‌లలో మిగతా జట్లను ఆడిస్తూ వాటి ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేస్తోంది. తాజాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి దాని ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసింది. ప్రస్తుతం కోల్‌కతా 12 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. అలాగే 12 పాయింట్లు మెరుగైన నెట్ రన్ రేట్‌తో పంజాబ్ నాలుగవ స్థానంలో ఉంది. కోల్‌కతాకు ఇంకా ఒక్క లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. అదే పంజాబ్‌కు ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలున్నాయి. కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే పంజాబ్ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అలాగే కోల్‌‌కతా మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించాలి.

ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ (26), కార్తీక్ (21)నాటౌట్, నితీశ్ రాణా (87) పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో నిగిడి రెండు వికెట్లు తీసాడు. మిట్చెల్, జడేజా, కర్న్ శర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. చెన్నై ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ (72), అంబటి రాయుడు (38), జడేజా (31) పరుగులతో చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోల్‌కతా బౌలర్లలో కమ్మిన్స్, వరుణ్ రెండేసి వికెట్లు తీశారు. 72 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.