Ravindra Jadejas Wife May Contest Gujarat Assembly Polls On Bjp Ticket
mictv telugu

ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ స్టార్ క్రికెటర్ భార్య ?

November 9, 2022

Ravindra Jadejas Wife May Contest Gujarat Assembly Polls On Bjp Ticket

టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా ఎమ్మెల్యేగా పోటీ చేయనుందా ? ఆమె కోసం రవీంద్ర జడేజా ప్రచారం చేస్తాడా ? అంటే అందుకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో రీవాబా జడేజా పోటీ చేస్తుందన్న వార్త అటు రాజకీయ వర్గాల్లో, ఇటు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గుజరాత్‌లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రీవాబా జడేజా బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటికి దిగనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 1, 5వ తేదిల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులను ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సిద్ధం చేసిన జాబితాలో జడేజా భార్య రివాబా జడేజా పేరు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అదీ కాక జడేజా భార్య కాంగ్రెస్ కీలక, సీనియర్ నేత హరి సోలంకికి దగ్గరి బంధువు. దాంతో రివాబా జడేజాకు టికెట్ ఇస్తే ఓట్లు చీల్చొచ్చని బీజేపీ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. మూడేళ్లు క్రితం బీజేపీలో చేరిన రివాబా జడేజా నాటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. రీవాబా జ‌డేజా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దివారు. ఒకవేళ భార్యకు ఎమ్మెల్యేగా టికెట్ వచ్చి బరిలో నిలిస్తే..రవీంద్ర జడేజా ప్రచారంలో దిగుతాడో లేదో వేచి చూడాలి.