రవితేజ తత్వం.. కరక్టేనా? - MicTv.in - Telugu News
mictv telugu

రవితేజ తత్వం.. కరక్టేనా?

June 26, 2017

ఎవరైనా మనకు తెల్సినోళ్లో,దగ్గరోళ్లో, ఆఖర్కి మన బద్దశత్రువు చనిపోయినా.. అయ్యో పాపం అని  చూశెనీకివోతం,కన్నీళ్లు  పెట్టుకుంటం,అసొంటిది  మన ఇంట్లోల్లు జీవిడ్శిన్రని తెలిస్తే మన మన్సు ఊకుంటదా..సప్త సముద్రాల అవుతలున్నా..పర్గు పర్గున ఇమానం ఎక్కి ఉర్కస్తం, నిర్జీవమైన ఆ శరీరాన్ని చూసి వాళ్లమీదున్న ప్రేమనంత కన్నీళ్ల రూపంలో తెల్పుతం, శవాన్ని ఎత్తేటప్పుడు కూడా..ఇంకా ఆఖరి సూపుకు ఎవరన్నా రావాల్నా అని అడుగుతరు, అందరు అచ్చేదాక శవాన్ని అట్లనే ఉంచుతరు.ఎందుకుంటే వాళ్లని మళ్లీ  లైఫ్ లో మనం చూడలేం కాబట్టి,ఇంట్లో మొగదిక్కు లేకపోతే ఆడవాళ్లు తలకొరివి పెట్టిన సందర్బాలెన్నో. ఎన్నికొట్లాటలున్న,ఎన్ని మనస్పర్ధలున్నా రక్తసంబందం రక్త సంబంధమే.ఎవలైన చనిపోయిన్రు అంటే వాళ్లమీద ఎంతో కొంత సానుభూతి ఉంటుంది.

రవితేజ గారు మీరు గ్రేట్ సారు..

మొన్న హీరో రవితేజ సోదరుడు భరత్.. కార్ యాక్సిండెంట్ లో చనిపోయిన విషయం అందర్కి తెలిసిందే,మరి అతనికి అందరూ ఉండి కూడా దిక్కూ మొక్కులేని అనాథ శవంలా ఆఖర్కి డబ్బులిచ్చి  తలకురివి పెట్టించాల్సిన పరిస్థితి,చనిపోయింది తన తమ్ముడు అని తెల్సినా రవితేజ మన్సు చలించలేదా?..మళ్లీ లైఫ్ లో తన తమ్మున్ని చూడలేను అన్న ఆలోచన ఎందుకు రాలేదు?ఆఖర్కి భరత్ అమ్మగారు కూడా కొడ్కు శవాన్ని చూడనీకి రాలేదంటే..బిడ్డను కడచూపు చూడనీకి తల్లి పేగు తల్లడిల్లలేదా?

ఎందుకు రాలేదని మాస్ మహారాజగారిని అడిగితే…

ఇన్నిసంవత్సరాలు తమతో కలిసున్న తమ్మున్ని ఇలాంటి పరిస్థితుల్లో నేను చూడలేను,చూసి తట్టుకోలేను దయచేసి అర్థం చేసుకోండి,అని మీడియాకు చెప్పారు..కానీ చనిపోయింది ఆయన సొంత తమ్ముడు…మన్సు జర్ర నిమ్మలం జేస్కొని రావాల్సిఉండే…తన తమ్మున్ని చూడడానికి ఆయన మన్సు తట్టకోలేకపోతే,అక్కడికివచ్చి దూరం నుంచైనా.. ఒక అన్నగా  ఆయన బాద్యతలు నిర్వర్తించేదుండే,ఇదే ఇప్పుడు ఆయన అభిమానుల మన్సుల్లో కలచివేస్తున్న భాద, అక్కడికచ్చిన వాళ్లందరి మన్సుల… చెప్పలేక దాగుపోయిన మాట.

మీరు మనసున్న సెలెబ్రీటీలు సార్…

ఎవరన్నా అభిమాని చనిపోతేనే వాళ్ల దగ్గరికెళ్లి ..వాళ్ల కుటుంబాన్నిపరామర్శించి వాళ్లని ఆదుకునే గొప్ప మన్సున్న సెలబ్రీటీలు సారు మీరు.మరి ఇంటోళ్లు చనిపోతే ఇంత పట్టింపులు ఇంత మన్సు కఠినం ఎందుకు చేస్కున్నారు సార్..ఇదేదో శవ రాజకీయాలు చేయడానికో, మిమ్మల్ని బ్లేమ్ చెయ్యాలనో ఇదంతా మేం చెప్పడంలేదు సార్,సొంత మన్షులు చనిపోయినా ఆఖరి చూపు చూడనంతగా మన్షుల మనసులు బండరాయిగా ఎందుకు మారుతున్నాయ్ మనిషనే వాడు ఏమైపోతున్నడు అని చెప్పడానికే మాబాదంతా.

మీరు తమ్ముడి మీదున్న అమితమైన ప్రేమతో,తమ్ముడి శరీరంపై  అయిన గాయాలను నేను చూడలేను చూసి తట్టుకోలేను అని చెప్పి మీరు రాలేదు సరే… కానీ అందరూ  ఏమన్కుంటున్నారో తెల్సా సార్ …గతంలో  మీ తమ్ముడు చాలా తప్పులు చేశాడు,డ్రగ్స్ కేసులున్నాయ్ అందకే రవితేజ…తమ్మున్ని ఆఖర్కి చూపు చూశెనీకి రాలేదు అని గుస గుస పెట్టుకుంటున్నారు సార్  అందరూ…..వాళ్లకా అవకాశం  మీరు ఎందుకు ఇచ్చారనే సార్   మాబాద.

సినిమా రంగుల ప్రపంచం అని అన్కుంటాం నిజమే కానీ…..

సినిమా ఒక రంగుల ప్రపంచం అని అన్కుంటాం …కానీ అందులో ఉన్న బ్లాక్ &వైట్ జీవితాలెన్నో…భరత్ కు తలకొరివి పెట్టింది ఒక జూనియర్ ఆర్టిస్ట్…తన పిల్లలకు  స్కూల్ ఫీజు కట్టడానికి పైసల్లేక ఈకార్యక్రమానికి ఒప్పుకున్నానని  అక్కడి వాళ్లతో చెప్పాడు..అంటే  సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్టుల పరిస్ధితి ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు,ఇగ ఇంకో పక్క చూస్కుంటే  కష్టపడి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి జల్సాలకు అలవాటు పడి ఇలా మద్యలోనే  ప్రాణాలు బలిచేస్కున్న వారెందరో.అతి వేగంతో వాహనాలను నడిపి  కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చిన  సెలబ్రిటీల పిల్లలు..గతంలో కూడా చాలామందే ఉన్నారు.

ఏది ఏమైన మన్షి ఎదిగినకొద్ది ఒదిగి ఉంటూ తప్పటడుగులు వేయకుండా తమ జీవితాన్ని సాగిస్తే దేవుడిచ్చిన తన జన్మను సార్ధకం చేస్కుంటాడు..మనకంటే తోపు ఎవ్వడు లేడు,నేనేమైనా చేస్తా ఇష్టమచ్చినట్టు బ్రతుకుతా ,ఇష్టం అచ్చినట్టు తాగి తందనాలాడుతా  అని నిర్లక్షంగా ఉంటే  ఇలా మన జీవితమనే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.