Raviteja launches wedding song from slum dog husband
mictv telugu

రవితేజ చేతుల మీదుగా మైక్ మూవీస్ ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ పెళ్లి పాట విడుదల

September 22, 2022

తెలుగు చిత్రసీమలో అత్యంత వైవిధ్యభరితమైన సినిమాలు నిర్మిస్తున్న మైక్ మూవీస్ తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్.’’ ఆసక్తికర ఇతివృత్తంతో అందరికీ ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ మూవీలోని పెళ్లి వేడుక పాటను మాస్ మహారాజా రవితేజ ఈ రోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత అన్నపరెడ్డి అప్పిరెడ్డి పాల్గొన్నారు. పాటలో చాలా జోష్ ఉందని, పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని రవితేజ మూవీ టీమ్‌కు శుభాకాంక్షల తెలిపారు.
‘‘లచ్చిగాని పెళ్లి ఇగ పార్శి గుట్టల లొల్లి

లచ్చిగాని పెళ్లి నువు మర్పా కొట్టర మళ్లీ..’’ అని మాంచి ఊపుతో సాగుతుంది ఈ పాట.
ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి పాడారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్నారు.