'ఖిలాడీ'గా రవితేజ.. ఫస్ట్ లుక్ ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

‘ఖిలాడీ’గా రవితేజ.. ఫస్ట్ లుక్ ఇదే

October 18, 2020

bgcbgn

మాస్ మహారాజ రవితేజ దూకుడు పెంచారు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఆల్రెడీ ‘క్రాక్’ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లాంచ్ చేశాడు. రవితేజ త్వరలో ‘వీర’ సినిమా దర్శకుడు రమేష్ వర్మతో తన 67వ చిత్రం చేయనున్నాడు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ మూవీకి ఖిలాడీ అనే టైటిల్‌ని పెట్టారు. 

నవంబర్ 2 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌధురి, డింపుల్ హయాతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర…’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘రాక్షసుడు’ బ్లాక్‌బస్టర్ తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘క్రాక్’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది‌.