భారత గూఢచారిని అరెస్ట్ చేశాం, దాడులకు కుట్ర..పాక్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత గూఢచారిని అరెస్ట్ చేశాం, దాడులకు కుట్ర..పాక్

July 16, 2020

'RAW agent' arrested in Karachi

పాకిస్థాన్ కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) నిన్న జాఫర్ ఖాన్ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేసింది. అతడు భారత్ కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (‘రా’-ఆర్ ఏ డబ్ల్యు) ఏజెంట్ అంటూ ఆరోపణలు చేస్తోంది. అలాగే డబ్బులు మార్పిడి చేసే సంస్థకు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది. రా స్లీపర్ సెల్ తో వారికి సంబంధం ఉందని ఆరోపణలతో చేస్తోంది. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారికి సహాయం చేస్తున్నారని, హవాలా ద్వారా డబ్బులను రా ఏజెంట్లకు చేరవేస్తూ ఉన్నారని ఎఫ్ఐఏ సీనియర్ అధికారి తెలిపారు. 

ఇక జాఫర్ ఖాన్ విషయానికి వస్తే.. అతడు కరాచీ ఫైర్ బ్రిగేడ్ లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అతడు కరాచీలో కొందరిని చంపడానికి, బాంబు దాడికి పాల్పడాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లు ఎఫ్ఐఏ అధికారులు చెబుతున్నారు. అతడు 14 నెలల పాటూ భారత్ లో ట్రైనింగ్ తీసుకున్నాడని.. బాంబులను తయారీ చేయడం, ఆయుధాలను ఎలా వాడాలో మొత్తం నేర్చుకున్నాడని ఎఫ్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు. వీరి దగ్గర తుపాకులు, లాప్ టాప్ లు, ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అనుమానితుల మీద కేసు రిజిస్టర్ చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.