ఏపీ : కొత్త జిల్లాలకు లీడ్ బ్యాంకులను ప్రకటించిన ఆర్బీఐ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ : కొత్త జిల్లాలకు లీడ్ బ్యాంకులను ప్రకటించిన ఆర్బీఐ

July 8, 2022

ఏపీలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు అదనంగా ప్రభుత్వం మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటికి లీడ్ బ్యాంకులను ఆర్బీఐ ప్రకటించింది. పాత 13 జిల్లాలకు అప్పటికే ఉన్న బ్యాంకలను యథాతధంగా ఉంచిన ఆర్బీఐ.. కొత్త జిల్లాలకు మాత్రమే లీడ్ బ్యాంకులను ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీఐ ప్రకారం జిల్లాలకు లీడ్ బ్యాంకులు ఇలా ఉండనున్నాయి. అవి ఏలూరు, కాకినాడ, కోనసీమ, నంద్యాల, బాపట్ల, అల్లూరి, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంకుగా వ్యవహరించనుంది. అన్నమయ్య, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఎస్బీఐ, సత్యసాయి జిల్లాకు కెనరా బ్యాంకులను ఆర్బీఐ ప్రకటించింది.