బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ ఎక్కువ ఉత్సాహం చూపిస్తోంది. ఇదే విషయం తాజాగా విడుదల చేసిన లెక్కలలో బయటపడింది. 2020 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు 132.34 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసినట్లు తేలింది. ఇతర కేంద్ర బ్యాంకులతో పోల్చితే మన రిజర్వ్ బ్యాంకే అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసి ప్రపంచంలోనే నంబర్. 1 గా నిలిచింది. 2020లో 41.68 మెట్రిక్ టన్నులు, 2021లో 77.5 మెట్రిక్ టన్నులు, 2022లో సెప్టెంబర్ నాటికి 31.25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ వరకు 785.35 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. దీంతో ఆర్ బీఐ వద్దనున్న విదేశీ మారకం నిల్వల్లో బంగారం నిల్వల వాటా 7.86 శాతానికి పెరిగింది .అనిశ్చితి మరియు ఆర్థిక సంక్షోభ సమయంలో కరెన్సీ విలువల్లో వచ్చే మార్పుల రిస్క్‌ను ఈ విధంగా హెడ్జ్ చేస్తుంటాయి. 1990-91లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం సమయంలో భారత ప్రభుత్వం.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లకు 67 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది.