RBI imposes 3 crores penaliy to amazon pay india
mictv telugu

అమేజాన్ కు ఆర్‏బీఐ భారీ షాక్

March 3, 2023

RBI imposes 3 crores penaliy to amazon pay india

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమేజాన్ కు భారీ జరిమానా విధించింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో అమేజాన్ కు రూ.3.06కోట్ల జరిమానాను విధించినట్లు ఆర్‏బీఐ ప్రకటించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‏స్ట్రుమెంట్స్, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ వేసినట్లు తెలిపింది. ఇప్పటికే ఆర్‏బీఐ అమేజాన్ కు షోకాజ్ నోటీసులు పంపించింది. జరిమాను ఎందుకు విధంచకూడదు అనే దానిపై సరైన కారణం చూపాలని సూచించింది. ఎంటిటీ రెస్పాన్స్‏ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్‏బీఐ గైడ్‏లైన్స్ పాటించడం లేదన్న అభియోగం రుజువైందని పేర్కొంది. అదేవిధంగా కస్టమర్ల లావాదేవీలకు పెనాల్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెజాన్ పే అనేది ఇ-కామర్స్ దిగ్గజం. అమెజాన్ యొక్క డిజిటల్ చెల్లింపు విభాగం. అయితే డిజిటల్ చెల్లింపుల విషయంలో ఫోన్ పే, గూగుల్ పేలు అత్యుత్తమ సేవలను అందిస్తూ మొదటిస్థానంలో కొనసాగుతున్నాయి. అమేజాన్ పే మాత్రం కేవలం 1 శాతంలోపే ఉండటం గమనించాల్సిన విషయం.