బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ మరో సౌకర్యాన్ని కల్పించడానికి సిద్ధమైంది. యూపీఐ ఆధారిత ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో ఇక నుంచి ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యం కల్పించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా కార్డుల క్లోనింగ్, మోసాలను అరికట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది.
ఏటీఎంకి వెళ్లిన తర్వాత అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేసి డబ్బులు తీయవచ్చు. అలాగే దీనికి ప్రత్యేకమైన చార్జీలు కూడా బ్యాంకులు విధించడానికి అవకాశం లేదు. ఇప్పటివరకు కార్డు ద్వారా జరిపే లావాదేవీలకు ఏ నిబంధనలైతే ఉన్నాయో అవే నిబంధనలు యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణకు వర్తించనున్నాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ఈ టెక్నాలజీకి ఇంటెరోపేరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌గా ఆర్బీఐ నామకరణం చేసింది.