RBI orders on behavior of debt recovery agents
mictv telugu

రుణ రికవరీ ఏజెంట్ల ఆగడాలపై ఆర్బీఐ ఆదేశాలు.. బ్యాంకులదే బాధ్యత

August 13, 2022

రుణ వసూళ్ల్ ఏజెంట్లపై ఆర్బీఐ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల ఆగడాలకు బ్యాంకులు, రుణ రికవరీ సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వీరి చేష్టల వల్ల అవమానాలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో ఆర్బీఐ పై ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ద్రవ్యపరపతి విధాన సమీక్షలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఏజెంట్ల ఆగడాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుణ వసూలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. అవి.

1. బకాయిల వసూలు కోసం ఎలాంటి బెదిరింపులు, వేధింపులకు పాల్పడరాదు
2. అందరి ముందు రుణ గ్రహీతలను అవమానించరాదు
3. ఏజెంట్లు ఉదయం 8 లోపు, సాయంత్రం 7 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్స్ చేయరాదు
4. రుణ గ్రస్తుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, మధ్యవర్తుల గోప్యతకు భంగం కలిగేలా వ్యవహరించరాదు.
5. సామాజిక మాధ్యమాల్లో రుణం తీసుకున్న వారికి వ్యతిరేకంగా ఎలాంటి మెసేజులు, పోస్టులు పెట్టరాదు.