ఏటీఎంలను మూసేయండి: ఆర్బీఐ - MicTv.in - Telugu News
mictv telugu

ఏటీఎంలను మూసేయండి: ఆర్బీఐ

May 15, 2017


ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను సైతం షేక్ చేస్తుండటంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. ‘వాన్నా క్రై’ బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై రాన్సమ్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసి, కీలకమైన డాటా మూసుకుపోయేలా చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. మనదేశంలోని దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. అదీగాక దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం ఏటీఎంలు ఔట్‌డేటెడ్ విండోస్ ఎక్స్‌పీపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఈ నెట్‌వర్క్‌పై మాల్‌వేర్ సులభంగా దాడి చేసే అవకాశం ఉంది. మాల్‌వేర్ దాడుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్‌పీ కూడా ప్రత్యేక అప్‌డేట్ ఇస్తామని ప్రకటించింది. దీంతో విండోస్ ప్యాచ్‌లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు సూచించింది. అంతవరకూ ఎటీఎం మెషీన్లను ఆపరేట్ చేయవద్దని ఆదేశించింది.

అయితే, తమ డబ్బు విషయంలో కస్టమర్లు భయపడాల్సిన పని లేదని ఏటీఎం ఆపరేటర్లు అంటున్నారు. ఏటీఎం యంత్రాల్లో డాటా స్టోరేజి ఉండదని, ఏటీఎంలు ‘వాన్నా క్రై’ బారిన పడే అవకాశాలు లేవని చెబుతున్నారు.

HACK:

RBI passed an order to all banks to close the ATMs’ due to wannacry ransomware attack.