rbi report on fruads of banks
mictv telugu

బ్యాంకుల్లో కుంభకోణాలు.. ఎగ్గొట్టిన డబ్బుల లెక్క ఇదీ

May 17, 2022

rbi report on fruads of banks

గత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరిగిన మోసాలు, ఎగ్గొట్టిన డబ్బుల లెక్కపై ఆర్బీఐ ఓ రిపోర్టు తయారు చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గతేడాది బ్యాంకింగ్ మోసాల పరిమాణం 51 శాతం తగ్గినట్టు వెల్లడించింది. 2020 – 21 ఆర్దిక సంవత్సరంలో రూ. 81,922 కోట్ల మేర మోసాలు జరుగగా, 2021 – 22 వచ్చేసరికి రూ. 40,295 కోట్లకు తగ్గింది. అయితే పరిమాణం తగ్గినప్పటికీ సంఖ్యాపరంగా మాత్రం మోసాలు తగ్గలేదు.

2021లో 9933 ఉదంతాలు చోటుచేసుకోగా, గతేడాది 7940 కి మాత్రమే తగ్గింది. ఆర్టీఐ చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తు చేయగా, ఆ మేరకు ఆర్బీఐ సమాధానమిచ్చింది. గత ఆర్ధిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా 431 మోసాలలో రూ. 9528 కోట్లు పోయాయి. ఎస్బీఐలో 4192 కేసులలో రూ. 6932 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 280 కేసులలో రూ. 3989 కోట్లు, యూనియన్ బ్యాంకులో 627 కేసులకు రూ. 3939 కోట్ల మేర మోసాలు జరిగాయి.