RBI to launch pilot project on digital currency from tomorrow
mictv telugu

డిజిటల్ రూపాయి వచ్చేసింది.. ఏంది దీని కథ?

November 1, 2022

ఎక్కడ చూసినా డిజిటల్.. డిజిటల్. డిజిటల్ లెసెన్సులు, డిజిటల్ పేమెంట్లు, డిజిటల్ ఆర్డర్లు, డిజిటల్ ప్రేమలు.. టెక్నాలజీ రాకతో మనిషి బతుకు ఎలక్ట్రానిక్ తతంగంమైపోయింది. మనీ విషయంలో ఇప్పటికే చాలావరకు మనం డిజిటల్ అయ్యాం. కొత్తిమీర కట్ట నుంచి ఖరీదైన కారు వరకు అన్నీ ఇప్పుడు డిజిటల్లో కొనేయిచ్చు. డిజటల్ మనీ వల్ల బోలెడు సౌకర్యాలు ఉండడం దీనికి కారణం. వెంట తీసుకెళ్లక్కర్లేదు. దొంగలు దోచుకుంటారని, ఎలకలు కొట్టేస్తాయని భయం లేదు. అందుకే తాజా తాజాగా ఈ రోజు(మంగళవారం) మన దేశ మార్కెట్లోకి డిజిటల్ కరెన్సీ వచ్చేసింది. డిజిటల్ రూపాయి తెస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్ ప్రససంగలోనే చెప్పారు. 1934 ఆర్‌బీఐ చట్టాన్ని సవరించి ఈ-కరెన్సీ తీసుకొచ్చారు.

భారత రిజర్వు బ్యాంకు అనుమతితో డిజిటల్ రూపాయిని(సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ) అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తతం హోల్‌సేల్ మార్కెట్లో ఇది అందుబాటులోకి వచ్చింది. త్వరలలో రిటైల్ మార్కెట్లలోకీ రానుంది. పైలట్ ప్రాజెక్టు కింద తొమ్మిది బ్యాంకులు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. కొన్ని పరిమిత లావాదేవీలకు దీన్ని అనుమతిస్తున్నారు. ఈ బ్యాంకుల్లో ఎస్బీఐ, బరోడా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, చ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా, యెస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్‌ఎస్‌బీసీ ఉన్నాయి.

సురక్షితమా?

పేరులోనే ఉన్నట్లు ఇది కంటికి కనిపించని చట్టబద్ధమైన, నిర్దిష్ట విలువగల కరెన్సీ. కేంద్ర బ్యాంకు దీన్ని మామూలు ఫిజికల్ కరెన్సీని విడుదల చేసినట్లే దీన్ని డిజిటల్ రూపంలో విడుదల చేస్తుంది. బ్యాంకుల ద్వారా చలామణి అవుతుంది. డిజిటల్ మనీకి ఉన్న అన్ని సౌలభ్యాలు దీని సొంతం. అయితే చట్టబద్ధతలేని, రిస్క్ ఎక్కువ ఉండే బిట్ కాయిన్ వంటి కరెన్సీల్లాంటిదికాదు. దీనిపై విలువకు ఆర్బీఐ పూచి ఇస్తుంది.

దేనికి వాడుకోవచ్చు?


అన్ని లావాదేవీలకు దీన్ని వాడుకోవచ్చు. ప్రజలు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలు దాచుకోవచ్చు. ఆర్బీఐ రెండు విధానాల్లో -రూపాయిని ప్రారంభించిమది. బ్యాంకుల మధ్య సాగే సెటిల్మెంట్లు, టోకు వ్యాపారంతోపాటు సాధారణ ప్రజలూ దీన్ని వాడొచ్చు. ప్రజలు తమ బ్యాంకు వాలెట్‌లో దీన్ని డిపాజిట్ చేసుకోవచ్చు.