A సిరీస్ సినిమాలు..18 ఏళ్లు పైబడిన వాళ్లు చూడాలి. కానీ A సిరీస్ నోట్లు ఎవరైనా చూడొచ్చు..ఎంచక్కా వాడేయొచ్చు. నోట్లకు సినిమాలకు లింకు ఏంటీ అనుకుంటున్నారా.. లింకు ఉంది మరి..రిజర్వ్ బ్యాంకు క్రియేటివ్ గా ఆలోచించి మరి నోట్లకు ఆ పేరే ఎందుకు పెట్టిందంటే….
మరింత సెక్యూరిటీ ఫీచర్స్ జోడించి కొత్త ఐదొందల నోట్లను రిజర్వ్ బ్యాంకు రిలీజ్ చేసింది. కొత్త నోటులో ‘ఏ’ అనే అక్షరాన్ని జోడించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు, వెనక వైపు 2017 అని ముద్రించిన కొత్త రూ. 500 నోటును విడుదల చేసినట్టు కేంద్ర బ్యాంకు వెల్లడించింది. దాదాపు ప్రస్తుత నోటును పోలిన 66 ఎంఎంx150 ఎంఎం, స్టోన్ గ్రే కలర్, రెడ్ ఫోర్ట్ భారతీయ వారసత్వ ప్రదేశం ఎర్ర కోట – రివర్స్ లో భారతీయ జెండా స్పెసిఫికేషన్స్ తో దీన్ని ఆర్ బీఐ రూపొందించింది. అలాగే మహాత్మా గాంధీ చిత్రపటాన్ని, అశోక్ స్థంభం కుడివైపున బ్లీడ్ లైన్స్ ఇతర గుర్తులతోపాటు, అంధులు గుర్తించేలా ఇంటగ్లియో ముద్రణను కూడా జత చేసింది.