దంచికొట్టిన బెంగళూరు.. చేతులెత్తేసిన కోల్‌కత్తా - MicTv.in - Telugu News
mictv telugu

దంచికొట్టిన బెంగళూరు.. చేతులెత్తేసిన కోల్‌కత్తా

October 13, 2020

nvmh

షార్జా వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌  బెంగళూరు మ్యాచ్‌లో కొహ్లీ సేన పరుగుల వరద పారించింది. డివిలియర్స్ దంచి కొట్టడంతో ఆ టీం భారీ స్కోర్ సాధించింది. దీంతో కోల్‌కత్తా ఆటగాళ్లు ఆదిలోనే చేతులు ఎత్తేయడంతో ఘన విజయం అందుకుంది. 82 పరుగుల భారీ తేడాతో  బెంగుళూరు విజయం సాధించింది. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

టాస్ గెలిచిన తర్వాత బెంగుళూరు బ్యాటింగ్‌కు దిగింది.  20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కోలకత్తా ఆటగాళ్లు ఆది నుంచే తడబడ్డారు. అందరూ తక్కువ స్కోర్‌కే వరుసగా ఔట్ అవుతూ వచ్చారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 82 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. డివిలియర్స్ 73 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌తో బెంగుళూరు 10 పాయింట్లతో మూడో స్థానానికి చేరగా, కోల్‌కతా 8 పాయింట్లతో నాలుగో స్థానానికి వచ్చింది.