ఆంధ్రపదేశ్‌లో 5 చోట్ల రీపోలింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రపదేశ్‌లో 5 చోట్ల రీపోలింగ్..

April 16, 2019

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పలుచోట్ల విధ్వంసాలు, హింస చెలరేగడం తెలిసిందే. పోలింగ్ తీరుపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాటిని ఈసీ కొట్టిపారేస్తోంది. అయితే కొన్ని చోట్ల పోలింగ్ సరిగ్గా జరగలేదని ఈసీ కూడా నిర్ధారణకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది.

gg

గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి చోట్ల.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ నిర్వహించాలని కోరింది. హింసాత్మక ఘటనలతోపాటు ఈవీఎల మొరాయింపు వంటి సాంకేతిక లోపాలు, పోలింగ్ ఆలస్యంగా మొదలు కావడం వంటి కారణాల రీత్యా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారని ఆ జిల్లాల కలెక్టర్లు ఈసీకి తెలిపారు. దీంతో రీపోలింగ్‌ నిర్వహణ జరపాలని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది సిఫార్సు చేశారు. రీపోలింగ్‌ తేదీలపై ఈసీఐ రేపు నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్పులపై ఈసీ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఓ, ఏఆర్‌ఓలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు.