రీకౌంటింగ్‌‌కై హైదరాబాద్‌లో 8 సెంటర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

రీకౌంటింగ్‌‌కై హైదరాబాద్‌లో 8 సెంటర్లు..

April 24, 2019

ఇంటర్మీడియెట్‌ ఫలితాల వెల్లడితో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇంటర్మీడియెట్ బోర్డు తప్పిదం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వారి తల్లిదండ్రుల నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కలిసి బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద‍్రిక‍్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇంటర్ బోర్డును రద్దు చేసే దిశలో ఆయన సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  విద్యార్థులు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా బోర్డు వెబ్‌సైట్‌, యాప్‌ ఓపెన్‌ కాకపోవడంతో విద్యార్థులు ఆపసోపాలు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా స్పందించిన ఇంటర్‌ బోర్డు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేసింది. రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయదలిచిన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా (bie.telangana.gov.in) మరియు TSONLINE ద్వారా దిగువ ఇచ్చిన కేంద్రాల్లో రీ వెరిఫికేషన్‌ కోసం రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా ఇంటర‍్మీడియెఓట్‌ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మహబూబియా జూనియర్‌ కాలేజీ, గన్‌ఫౌండ్రి, హైదరాబాద్‌
ఎంఏఎం జూనియర్‌ కాలేజీ, నాంపల్లి హైదరాబాద్‌
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కాచిగూడ, హైదరాబాద్‌
ప్రభుత్వ బాలుర జూనియర్‌ కాలేజీ, ఫలక్‌నుమా, హైదరాబాద్‌
(మొబైల్‌ నెంబర్‌: 9848781805)

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, హయత్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లా
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, శంషాబాద్‌, రంగారెడ్డి జిల్లా
(మొబైల్‌ నెంబర్‌: 9848018284)

జిల్లా ఇంటర్మీడియోట్‌ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మల‍్కాజ్‌గిరి, మేడ్చల్‌ జిల్లా
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కూకట్‌పల్లి, మేడ్చల్‌ జిల్లా 
మొబైల్‌ నెంబర్‌: 9133338584)