ఐటెం సాంగు విమర్శలపై స్పందించిన సమంత - MicTv.in - Telugu News
mictv telugu

ఐటెం సాంగు విమర్శలపై స్పందించిన సమంత

December 20, 2021

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలలో ఎక్కడా చూసినా.. ఊ అంటావా మామ – ఉహూ ఉహూ అంటావా మావ అంటూ కుర్రకారు ఈ పాటను పదే పదే మోగిస్తున్నారు. అయితే ఈ పాటపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ.. పాట పాడారని అతనిపై కేసులు నమోదు చేశారు.

అంతేకాకుండా ఈ పాటలో మీ మగ బుద్ధే వంకర బుద్ధి అనే లైన్‌పై అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో పలు సంఘాల నేతలు తామ మనోభావాలు దెబ్బతీసేలా రాశారంటూ కేసులు పెడుతున్నారు. ఈ విమర్శలపై డైరెక్టర్ సుకూమార్, హీరో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాదులు స్పందించారు. కానీ, సమంత మాత్రం స్పందించలేదు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సమంత విమర్శలపై స్పందించింది. ఈ ఐటెం సాంగ్ చేయడంతో తనకెంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఈ పాటతో తనకు మరింత గుర్తింపు వచ్చిందని హర్షం వ్యక్తం చేసింది. డ్యాన్స్ చేయడంలో అల్లు అర్జున్‌తో పోటిపడ్డానని, అందుకు గర్వంగా ఉందని సమంత తెలిపింది. అంతేకాదు ట్విట్టర్‌లో పాటపై వస్తున్న పలు ఫన్నీ వీడియోలను పోస్ట్ చేసింది.