అదీ కూడా మీరే చెప్తే ఇంకా బావుండేది - MicTv.in - Telugu News
mictv telugu

అదీ కూడా మీరే చెప్తే ఇంకా బావుండేది

June 18, 2017

చాలా రోజుల తర్వాత మోడీగారు మాంచి సలహా జనం మీదికి విసిరి కొట్టారు.  కేరళ రాష్ట్రంలో రీడింగ్ మంత్ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్నరు  దామోదర దాస్ నరేంద్ర మోడీ సారు. స్నేహితులకు, బంధువులకు బోకే బదులు… ఓ మంచి పుస్తకం బహుమతిగా ఇవ్వాలని సూచన చేశారు. నిజమే సారు చానా మంచి సూచన చేశారు. అయినా ఈ రోజుల్లో జనాలకు పుస్తకాలు చదివే ఓపిక ఎక్కడిది సారు… వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే పుస్తకం ఏదైనా ఉంటే మీరే సెలవిస్తే బావుండేదని కొందరు అంటున్నరు. అయితే జనాలకు ఇప్పటికి ఉన్న ఓపికి ఒకే.  బ్యాంకుల  ముందు రోజుల తరబడి నిలబడటం ఎట్లా…. ఎటిఎంల ముందు ఓపికతో  క్యూలు కట్టడం ఎలా… భార్య బ్యాంకుల వద్ద ఉంటే  ఇంటి పనులు చేయడం ఎలా అని ఓ మంచి పుస్తకం రాసి మంది చేతిలో  పెడితే మీ సూచన  పన్జేస్తుంది. జనాలకూ ఉపయోగకరంగా ఉంటుంది. ఎమంటరు మోడీ సారు.