వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఆయన కొడుకుని అని చెప్పుకుంటున్న శివచరణ్ మరో బాంబు పేల్చారు. ‘నాన్నా.. నేను మీ కుమారుడిని. ఈ విషయాన్ని మీడియా ముందు ఒప్పుకోండి. లేదంటే డీఎన్ఏ పరీక్షకు రండి. ఇప్పటివరకు సమర్పించిన ఆధారాలపై మీరు స్పందించలేదు. నాకు మీ ఆస్తులు, రాజకీయ వారసత్వం అవసరం లేదు. కొడుకుగా ఒప్పుకుంటే చాలు’ అని సవాల్ చేశారు. ఇంతకు ముందు తాను మేకపాటి కొడుకుని అని శివచరణ్ అనేక ఆధారాలు మీడియాకు రిలీజ్ చేశాడు. తన అమ్మ.. నాన్నతో కలిసి ఉన్న ఫోటోను రివీల్ చేశాడు. తమను వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. కేవలం చదువుకోవడానికి స్కూలు ఫీజు కట్టేస్తే బాధ్యత తీరిపోతుందా? అని ప్రశ్నించారు. శివచరణ్ తల్లి కూడా ఇదే విధంగా నిలదీయడంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ఇప్పుడు శివచరణ్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష అంటుండడంతో మేకపాటి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా, రాజకీయంగా నెల్లూరులో బలమైన కుటుంబంగా పేరుపొందిన మేకపాటి ఫ్యామిలీ.. ఆర్ధికంగా కూడా అత్యంత బలంగా ఉంది. రాజకీయం, ఆర్ధిక రంగాల్లో వీరి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటి ఫ్యామిలీ శివచరణ్ రెడ్డి అనే యువకుడి కారణంగా వివాదంలో చిక్కుకోవడంతో చర్చనీయాంశమైంది.