కేకే పిలిస్తే చర్చలకు సిద్ధం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ  - MicTv.in - Telugu News
mictv telugu

కేకే పిలిస్తే చర్చలకు సిద్ధం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ 

October 14, 2019

Ready to talks with government if kk

తెలంగాణ ప్రభుత్వం.. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని టీఆర్ఎస్ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావు కోరడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు స్పందించారు. తమవి గొంతెమ్మ కోరికలేమీ కాదని, తమను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేని, ఆయన పిలిస్తే చర్చలకు వెళ్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు.

తమ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నేతలు ఈ రోజు గవర్నర్ తమిళిసైను కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండుతో సమ్మె చేశామని వివరించారు. తర్వాత అశ్వత్థామరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘మా సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. చర్చలకు కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే. ఆయనపై మాకు గౌరవం ఉంది. ఆయన ఆహ్వానిస్తే చర్చలకు రావడానికి సిద్ధం..’ అని చెప్పారు. కొంతమంది మంత్రులు సమ్మె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఏం మాట్లాడడో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మంత్రులు రెచ్చగొడుతున్నా ఆర్టీసీ జేఏసీ నాయకులు సంయమనం పాటిస్తున్నారు. టీఎన్జీవో నేతలకు ఆర్టీసీ సమ్మె గురించి చెప్పలేదనడం సరికాదు. ఉద్యోగ సంఘాల నేతలపై మాకు నమ్మకం ఉంది…’ అని తెలిపారు.