కేసీఆరే రియల్.. ప్రభాస్, ఎన్టీఆర్ అంతా రీల్స్.. ఆర్జీవీ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆరే రియల్.. ప్రభాస్, ఎన్టీఆర్ అంతా రీల్స్.. ఆర్జీవీ

September 27, 2022

 


ఎప్పుడూ వివాదాల‌తో వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వ‌ర్మ.. తాజాగా చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ ట్వీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ పొగిడేశారు ఆర్జీవీ. సినిమా నటుల్లా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని, వారంతా రీల్ స్టార్స్ అంటూ ట్వీట్ చేశారు. ‘బాహుబలి, RRR, పుష్ప, KGF 2 సినిమాల అడుగుజాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీ కూడా పాన్ ఇండియా వైడ్‌గా BRSగా వెళుతుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యశ్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వలె కాకుండా.. రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్..’ అంటూ వర్మ రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ కొత్త పార్టీ అధికారికంగా ప్రారంభించబడుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రంగాల్లోని నిపుణులతో బ్యాక్‌ గ్రౌండ్ వర్క్, సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. అలాగే కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా కేసీఆర్.. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, రైతులను కలుస్తున్నారని తెలిపాయి.