పోలీస్ అంటే నువ్వే - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ అంటే నువ్వే

November 3, 2017

తనో పోలీస్.. విధుల్లో నిత్యం ప్రజలకోసం పాటుబడ్డాడు. చివరకు తాను చనిపోతూ, మృత్యువు ఒడిలోకి జారిపోతూ అవయవదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  మియాపూర్ ట్రాఫిక్ విభాగంలో ఎన్. లక్ష్మణ్(56) సబ్‌ఇన్స్పెక్టర్ఆఫ్‌పోలీస్ (ఆర్ఎస్ఐ)గా పనిచేస్తున్నాడు.

గురువారం (31-10-2017) రోజున డ్యూటీ ముగించుకొని మోటార్ సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఈసిఐఎల్ దగ్గరకు చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆయన వాహనానికి ఢీ కొట్టింది. దీంతో లక్ష్మణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది, ఆయన మృత్యుఒడికి చేరాడు. కుటుంబసభ్యుల అనుమతితో అవయవదానం (ఆర్గాన్ డొనేషన్)  లివర్, కిడ్నీలను ఉస్మానియా. గాంధీ ప్రభుత్వాసుపత్రి వైద్యులకు అందజేశారు.

ఇతనికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ  ‘లక్ష్మణ్  క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాడని’ కొనియాడారు. తాను చనిపోయిన తర్వాత అవయవదానం చేసి ఇతర పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలిచారన్నారు.