Home > Featured > 4 కెమెరాల ఫోన్ రూ.10 వేలకే.. రియల్‌మీ సంచలనం

4 కెమెరాల ఫోన్ రూ.10 వేలకే.. రియల్‌మీ సంచలనం

Realme 5 Pro.

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ మి ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో రియల్ మి మంగళవారం మరో రెండు స్మార్ట్‌‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. నాలుగు కెమెరాలతో రియల్‌ మి 5ప్రో, రియల్‌మి 5 పేరుతో ఈ ఫోన్లను తీసుకువచ్చింది. సెప్టెంబరు 4వ తేదీ నుంచి ఈ ఫోన్లను ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్‌ మి.కామ్‌లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. రియల్‌ మి5 ఆగస్టు 27న ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. నాలుగు కెమెరాలు ఉన్న రియల్‌ మి5 ఫోన్‌ను రూ.10వేలలోపు అందించడం విశేషం.

రియల్ 5ప్రోను మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. 4జీబీ ర్యామ్‌ +64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధరను రూ.13,999గా అందిస్తున్నారు. ఇక 6జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌+128జీబీ అంతర్గత మెమొరీ ఉన్న మొబైళ్ల ధరలను వరుసగా రూ.14,999, రూ.16,999గా అందిస్తున్నారు. 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌ కలిగిన రియల్‌మి 5 ప్రారంభ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్‌ ధర రూ. 10,999, 4జీబీ ర్యామ్‌ /128జీబీ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధరను రూ.11,999గా నిర్ణయించారు.

జియో వినియోగదారులు అయితే రియల్‌మి5 ప్రో ప్రారంభ ఆఫర్‌ కింద రూ.7వేల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. వడ్డీ లేని వాయిదాలు, ఫ్లిప్‌కార్ట్‌ అందించే పూర్తి మొబైల్ ప్రొటెక్షన్‌ పొందవచ్చు. పేటీఎం ఫస్ట్‌ మెంబర్‌ షిప్‌తో పాటు, పేటీఎం యూపీఐ ద్వారా కొనుగోలు చేసేవారు రూ.2వేల వరకూ క్యాష్‌‌బ్యాక్‌ అందిస్తున్నారు. కాగా, రియల్‌5పై ఎలాంటి ఆఫర్లను సంస్థ ప్రకటించలేదు.

అలాగే రియల్‌మి టోట్‌ బ్యాగ్‌(రూ.1,199, సేల్‌: సెప్టెంబరు 4) రియల్‌మి బడ్స్‌2(రూ.599 సేల్‌: సెప్టెంబరు 4) రియల్‌మి ఐకానిక్‌ కేస్‌(రూ.399-సేల్‌: సెప్టెంబరు 21)లను కూడా సంస్థ విడుదల చేసింది.

రియల్‌ 5ప్రో ఫీచర్లు..

* 4జీబీ+64జీబీ, 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ ర్యామ్‌, స్టోరేజ్‌ వేరియంట్స్‌
* 6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే

* వెనుకవైపు 48+8+2+2 మెగాపిక్సెల్స్‌ కలిగిన నాలుగు కెమెరాలు(48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ వైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌, 2ఎంపీ మాక్రో సెన్సార్‌, 2 ఎంపీ పోట్రేట్‌ సెన్సార్‌)
* 4,035ఎంఏహెచ్‌ బ్యాటరీ
* కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ 3+ ప్రొటెక్షన్‌
* స్నాప్‌డ్రాగన్‌ 712 ప్రాసెసర్‌, 2.3గిగాహెడ్జ్‌ క్లాక్‌ స్పీడ్‌

* మెమొరీ కార్డు సాయంతో 256జీబీ వరకూ స్టోరేజ్‌ను పెంచుకునే వెసులుబాటు
* ముందువైపు 16మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
* టైప్‌-సి పోర్ట్‌, వూక్‌ 3.0 ఫాస్ట్‌ ఛార్జింగ్‌

రియల్‌ మి5 ఫీచర్లు

* 3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌, 32జీబీ, 64జీబీ, 128జీబీ మెమొరీ ఆప్షన్స్‌
* 6.5 అంగుళాల హెడ్‌+ డిస్‌ప్లే

* 12+8+2+2 మెగాపిక్సెల్స్‌ కలిగిన నాలుగు కెమెరాలు
* 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, మైక్రో యూఎస్‌బీ

* మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 256జీబీ వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటు
* స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌
* ముందువైపు 13మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

Updated : 20 Aug 2019 7:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top